ఇక రేపు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 107 నుండి టీజర్ విడుదలైంది. ఇందులో ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి.ఇక ఈ టీజర్‌లో బాలయ్య ఇష్టదైవం లక్ష్మీ నరసింహా స్వామి చూపిస్తూ స్టార్ట్ చేశారు. నోటిలో సిగార్‌తో నల్ల షర్టుతో బాలయ్య లుక్ అయితే అదిరిపోయింది. ఈ సినిమాలో ఓ ఊరి పెద్ద పాత్రలో ఆయన నటించారు. మరోసారి మైనింగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఈ టీజర్ చూస్తే ఖచ్చితంగా తెలుస్తోంది. మొత్తంగా వరుసగా జీపులు ఒకదాని వెంట ఒకటి వెళ్లే సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.ఇక ముఖ్యంగా భయం నా బయోడేటాలోనే లేదు బోసుడీకే.. నరకడం మొదలు పెడితే.. ఏ పార్ట్ ఏదో మీకు పెళ్లాలకు కూడా తెలియదు నా కొడక్కల్లారా వంటి చెప్పే డైలాగులు బాలయ్య అభిమానులకు కిక ఎక్కించేలా ఉన్నాయి. మొత్తంగా ధర్మ సంస్థపానార్ధం ఆయుధం పట్టిన వ్యక్తి పాత్రలో బాలయ్య క్యారెక్టర్‌ను యువ దర్శకుడు గోపీచంద్ మలినేని డిజైన్ చేశాడు. ఇక ఈ సినిమాలో లేడీ విలన్‌గా పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.
ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన 'క్రాక్' సినిమాలో కూడా జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా.ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే పవర్‌ఫుల్ పాత్రలో ఆమె కనిపించనుంది. ఇక క్రాక్ సినిమాలో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం తెలుస్తుంది. NBK107 చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మంచి కీలక పాత్రలో కనిపిస్తారు. అలాగే ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు రంగానికి విలన్‌గా పరిచయం అవుతున్నారు.ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చిత్రం చేస్తుండగా, ఈ సినిమాకి కూడా ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్నారు. రేపు ఈ మూవీకి సంబంధించిన కీలక ప్రకటన కూడా రానుంది.