'NTR 30' కోసం మరో స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్న కొరటాల..?

Anilkumar
తాజాగా విడుదలైన ఆచార్య ఫస్ట్ ఫ్లాప్ రుచి చూసిన కొరటాల..ప్రస్తుతం ఇప్పుడు వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్నాట్లు తెలుస్తుంది. అయితే జనరల్ గా కొరటాల అంటే ఓ సపరేటు మార్క్ ఉంటుంది.ఇకపోతే కొన్ని సీన్స్ ని ఆయన లాగా ఎవ్వరు చూయించలేరు. ఇక అది మనం మిర్చి సినిమా చూసిన, జనతా గ్యారేజ్ చూసిన క్లీయర్ గా అర్ధమైపోతుంది. ఇకపోతే మరి అలాంటి కొరటాల అస్సలు కధే లేని పాయింట్ తో మెగా హీరోల తో సినిమా తీయ్యడమే పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది.పోగా కొరటాల శివ..ఎవ్వరు మాటలు వినకుండా తను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే వెళ్లుంటే..కధ సుఖాంతం అయ్యేది.


కానీ, మరి మధ్యలో చిరంజీవి, చరణ్ లు చెయ్యి వేసి కధ మొత్తం కిచిడి అయిపోయింది. అయితే దీంతో మెగా హీరోలతో హిట్ కొడతాం అనుకున్న కొరటాల ఆశలు నిరాశగానే మిగిలాయి. ఇకపోతే తాజాగా ఇప్పుడు కొరటాల శివ ఆశలన్ని తారక్ పైనే పెట్టుకుని ఉన్నాడు. ఇక ఎలాగైన NTR30 సినిమా హిట్ కొట్టాలి లేకపోతే ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతాయి.అయితే ఈ సినిమా విషయం లో కొరటాల శివ ప్రతి పాయింట్ ని క్షుణంగా పరిశీలించాకనే ముందడుగు వేస్తున్నారట.కాగా ఈ క్రమంలోనే.ఇక సినిమా కి మహేశ్ సాయం కోరుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మహేశ్ బాబు వాయిస్ చాలా ప్లెసంట్ గా..కూల్ గా ఉంటుంది. అంతేకాదు ఎలాంటి వారినైన అట్రాక్ట్ చేస్తుంది.


ఇప్పటికే చాలా మంది బడా హీరో సినిమాలకు ఆయన మాట సాయం చేశారు. కాగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు తారక్ సినిమాకి కూడా మహేశ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి దిపికా పదుకునే ని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇలాంటి ఘన విజయాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక  ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్ లను రా బట్టిందో మనందరికి తెలుసు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. అయితే మరి చూడాలి మహేశ్ మాట తారక్ నటన..కొరటాలకు సక్సెస్ ఇస్తాయో లేదో,,?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: