ఎన్ బి కే..107 ఫస్ట్ హంట్ లోడింగ్.. పోస్టర్ వైరల్..!!

Divya
అఖండ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి బాలయ్య 107 అనే టైటిల్ ని కొంచెం పోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గత చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై అభిమానులకు సైతం భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఈ సినిమాకు సంబంధించి లుక్ ను రిలీజ్ చేయగా.. ఎన్టీఆర్  100వ జయంతి సందర్భంగా టైటిల్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి కానీ ఆ సమయంలో కేవలం పోస్టర్ మాత్రమే విడుదల చేశారు.


ఇక బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను చిత్ర బృందం సభ్యులు విడుదల చేయబో తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఎన్.బి.కె 107 ఫస్ట్ హంట్ లోడింగ్ అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఒకట్రెండు రోజుల్లో ఈ పోస్టర్ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇక బాలయ్య గెటప్ చూస్తే అభిమానులు కూడా పూనకాలు వస్తున్నాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై పలు టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు గా ప్రచారంలో ఉన్నది.

ముఖ్యంగా ఈ టైటిల్ కోసం జై బాలయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ నటిస్తున్నది. ఈ సినిమాకి ఎటువంటి ఆటంకం కలగకుండా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ చిత్ర యూనిట్ సభ్యులు తెలుపుతున్నారు. అఖండ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య అదే స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించే పోతున్నట్లుగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలియజేశారు. ఇక మరొకవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణ 108వ సినిమాకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: