ప్రెగ్నెంట్ అయినా తగ్గేది లేదంటున్న సోనం కపూర్...!!
బాలీవుడ్ చాలా కాలంగా సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. సుదీర్ఘమైన కెరీర్లో తక్కువ సినిమాలనే చేసింది. కానీ, విశేషమైన గుర్తింపును కూడా ఆమె దక్కించుకుంది. మరీ ముఖ్యంగా 'నీర్జా' మూవీ ఆమె కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది.. అంతలా ఇది ఆమెకు పేరును తెచ్చిపెట్టింది. దీనితో పాటు 'ప్రేమ్ రతన్ దన్ పాయో', 'ఖూబ్సూరత్' సహా ఎన్నో సినిమాల్లో కూడా ఆమె సత్తా చాటింది.
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్లో ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్ను కూడా కొనసాగిస్తోంది. తద్వారా ఈ భామ తనలాంటి మహిళలకు మంచి దారి చూపింది.
అప్పటి నుంచి సినిమాల్లేవుగా
సోనమ్ కపూర్ సినిమాల వేగం తగ్గించడంతో ఆమె గర్బవతి అయిందని ప్రచారం కూడా జరిగింది. కానీ, దీనిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిందట.. ఈ మేరకు గర్భంతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ అందాలను ఆరబోస్తూనే ఉంటోందట . ఇందులో భాగంగానే తాజాగా టాప్ అందాలను హైలైట్ చేస్తూ దిగిన ఓ సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన కూడా దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోందని సమాచారం.