ప్రభాస్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన హీరోయిన్.. కారణం..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు నటించిన నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతిసనన్.. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. దీంతో అక్కడ నటిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇలాంటి క్రమంలోనే కృతి సనన్ నటించిన మిమి చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. డబ్బుకోసమే సరోగసీ ద్వారా బిడ్డను కని అవివాహిత పాత్రలో ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన నటనను కనబరిచింది అని చెప్పవచ్చు.


మిమి చిత్రంలో కృతి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్నది. తాజాగా ప్రకటించిన ఐఫా-2022 లో ఫంక్షన్లో ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్న ది. ఈ అవార్డు అందుకున్న నేపథ్యంలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకొని.. అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడడం జరిగింది.మిమి చిత్రం తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది అని ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు తనతో నటించిన నటులకు కూడా గెలిపించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసింది మొదటిసారి ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలుపు కొచ్చింది ఈ ముద్దుగుమ్మ.


ఇక కృతి సనన్ నటిస్తున్న ప్రస్తుత సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నది ఇక ఈ చిత్రం గురించి కూడా మాట్లాడుతూ ప్రభాస్ తో నటిస్తున్న ఈ సినిమా తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని తెలియజేసింది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఈమె సీత పాత్రలో నటిస్తున్నది ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ తో నటిస్తున్న ఈ సినిమాపై కృతిసనన్ మాట్లాడడంతో కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: