ట్రైలర్: ఆ బడా ఫ్యామిలీ హీరో ట్రైలర్ ఎవరు పట్టించుకోలేదా..?

Divya
హీరో కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే గత కొన్ని విభేదాల వల్ల ఈ హీరోకి మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్టు రాలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ హీరో నటించిన కిన్నెరసాని సినిమా విడుదలవుతోంది. దీంతో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా కూడా ఓటీటీ లో విడుదలకు సిద్ధం చేశారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జి-5 లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కిన్నెరసాని చిత్రం ఈనెల 10వ తేదీన విడుదల కాబోతోంది ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం కాస్త విభిన్నంగా ఉండటంతో ప్రతి ఒక్క ప్రేక్షకులు ట్రైలర్ను చూసి సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంతో కళ్యాణ్ దేవ్ తో పాటుగా ఇతర నటీనటులు పాత్రలకు కూడా చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇందులో కళ్యాణ్ దేవ్ పక్కన ఆన్ శీతల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది.


ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే కిన్నెరసాని ఏదో ఒక ప్రత్యేకమైన విషయం ఉండబోతోంది అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా మొత్తం కూడా కిన్నెరసాని అనే ఒక పుస్తకం చుట్టూ తిరిగి పోతున్నట్లుగా ట్రైలర్లు చూపించడం జరిగింది. గత సినిమాలతో పోలిస్తే కళ్యాణి దేవ్ సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాట్ల గా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ తో ప్రతి ఒక్కరి అంచనాలను పెంచేశారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా రామ్ తుల్లురి ఉన్నారుఇటీవల విడుదలైన సూపర్ మచ్చి సినిమా కళ్యాణ్ దేవ్ కు నిరాశ మిగిల్చింది. అది ఈ చిత్రం తో నైనా ఆకట్టుకుంటాడెమో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: