అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా ఈ శుక్రవారం విడుదల అయ్యి భారీ స్థాయిలో విజయాన్ని తెచ్చి పెట్టడంతో పాటు ఆయన గత చిత్రాల కంటే 5 రెట్లు ఓపెనింగ్స్ ను కూడా తెచ్చి పెట్టింది. కాబట్టి ఆయన కెరీర్లోనే స్పెషల్ సినిమాగా నిలిచింది ఈ సినిమా. టాలెంటెడ్ యాక్టర్ గా మంచి పేరున్న ఆయనకు కమర్షియల్ సక్సెస్ లు ఎక్కువగా సాధించడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా శేష్ కు ఘన విజయం సాధించ వలసిన అవసరం ఏర్పడగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
కలెక్షన్ల పరంగా కూడా విడుదలైన అన్ని సెంటర్లలో అన్ని థియేటర్లలో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి ఆ విధంగా ఇంతటి భారీ కమర్షియల్ సక్సెస్ ను సాధించుకున్న అడవిశేషు తన తదుపరి సినిమాలపై కూడా అంచనాలు భారీ స్థాయిలో పెంచుకున్నాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మేజర్ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి రికార్డులను నెలకొల్పే విధంగా ముందుకు వెళుతుంది ఈ చిత్రం.
తన కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచిన ఈ సినిమా గురించి అడవిశేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ వసూళ్లు చూసి ఎంతో థ్రిల్ కి గురయ్యాడు అడవిశేష్. మొదటగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఒప్పుకుని అండగా నిలిచిన మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల కంటే ఐదు కోట్ల కలెక్షన్లను ఎక్కువగా ఓపెనింగ్స్ ను రాబట్టింది ఈ సినిమా విజయాన్ని సాధించడానికి కారణమైన ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిని అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ సినిమా చేశానని అది ప్రేక్షకుల అందరూ ఎంతో అర్థవంతంగా మార్చారు అని ఆయన పేర్కొన్నారు. తొలి రోజునే ఈ సినిమాకు సంచలన వసూళ్లు వచ్చాయి.