'విరట పర్వం' ట్రైలర్ లాంచ్ కు వేదికను ఖరారు చేసిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు ఆయన దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యే  విడుదల అయిన భీమ్లా నాయక్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న దగ్గుబాటి రానా తాజాగా నటించిన విరాట పర్వం సినిమా జూన్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.


అనేక సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ లో దగ్గుబాటి రానా నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో సాయి పల్లవి రానా సరసన హీరోయిన్ గా నటిస్తుండగా,  ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ , సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ మూవీ నిర్మించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఒక ప్రకటన చేసింది.


తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కి చిత్ర బృందం వేదికను కన్ఫామ్ చేసింది. ఈ మూవీ ట్రైలర్ ని రేపు మే 5 వ తేదీన కర్నూల్ లో గ్రాండ్ ఈవెంట్ నడుమ రిలీజ్ చేస్తున్నట్టు  నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు తాజాగా అధికారిక ప్రకటన  చేసారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వేణు ఉడుగుల నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. విరాట పర్వం మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: