"26/11 దాడుల్లో ఎందరో సైనికులు పోరాడారు".. సందీప్ ఉన్ని కృష్ణన్ నే ఎందుకు ?

VAMSI
అడవి శేష్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం మేజర్. ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా నేడు ఎంతో ఘనంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని థియేటర్ ల వద్ద ఈ సినిమాని చూడటానికి జనాలు భారులు తీరి దర్శనమిస్తూ కోలాహలం చేస్తున్నారు.
ఈ సినిమా కథనం 26/ 11 ముంబై దాడుల్లో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు.. దానిని ఆధారం చేసుకునే ఈ సినిమా రూపుదిద్దుకోగా మేజర్ పార్ట్ మాత్రం ఆ ఘటనలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ దే.

కాగా ఈ పాత్రలో అడవి శేష్ అద్భుతంగా ఒదిగిపోయారు. ఒక గొప్ప సైనికుడిగా కనిపిస్తూ తన లోని మరో కోణాన్ని  చూపారు. ఈ సినిమాలో  సందీప్ ఉన్నికృష్ణన్ భార్య పాత్రలో సయి మంజ్రేకర్ చాలా బాగా నటించారు. అన్ని పాత్రలు కూడా ప్రేక్షకుల మనసును చేరేలా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకి కన్నీళ్లు కరిగిస్తోంది.  ఒక సైనికుడు ఎలా తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకోసం నిలబడుతూ అన్నది కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే ప్రతి సైనికుడు ఇదే ఉద్దేశంతో తమ ప్రాణాలకు అపాయం ఉంటుందని తెలిసి ఆర్మీ డ్రెస్ ని తొడుక్కుంటారు, అదే విధంగా ఆనాడు 2008 లో ముంబై కాల్పుల్లో ఎందరో సైనికులు ప్రజల కొరకు ప్రాణాలను కోల్పోగా ఒక్క ఉన్ని కృష్ణన్ ని మాత్రం ఎందుకు హైలెట్ చేస్తూ ఆయన జీవిత కథను తెరకెక్కించారు..?? మిగిలిన సైనికులకు ఎందుకు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదు అన్న సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది.      

కాగా సందీప్ ఉన్నికృష్ణన్ ను ఎందుకు ప్రత్యేకంగా చూపించారు అన్నదానిపై  ఇటీవలె మేజర్ మూవీ డైరెక్టర్ శశికిరణ్ క్లారిటీ ఇచ్చారు. ఫ్రీడం ఫైటర్స్ ఎందరో ఉంటారు కానీ అందరిలో కొందరు మాత్రమే ప్రాముఖ్యతను పొందుతారు. ఎందుకంటే వారు ముందుండి టీం ని నడిపించడమే కాదు సమస్య వచ్చినప్పుడు ముందుగా వారిని ఎదుర్కోవడానికి దైర్యం చేస్తుంటారు, ఇలా చాలా ఉంటాయి. అలాగని మిగిలిన సైనికులు తక్కువని కాదు, అలా అయితే వారు తమ ప్రాణాలను కోల్పోయే వారు కాదు. అయితే ఈ కథ అనుకున్నప్పుడు సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర అయితే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని భావించారు, అలా సెలెక్ట్ చేయడం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఆయన పాత్ర కోసం నటుడిని వెతుకుతుండగా అడవి శేషు లుక్ సందీప్ ఉన్నికృష్ణన్ కు చాలా దగ్గరగా అనిపించింది. అలాగే అడవి శేషు కూడా తన నటన ప్రతిభ మరోసారి కనబరిచి విలక్షణ నటుడు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు అని అన్నారు.  ఇక సందీప్ ఉన్నికృష్ణన్ గారి కుటుంబం కూడా ఈ సినిమా తీయడానికి ఎంతగానో సహకారం అందించింది. సమాచారం అందించడం, ఆయన హావభావాలకు సంబందించిన విషయాలను తెలపడం వంటి వాటి గురించి ఎంతో ప్రేమగా వెల్లడించారు దర్శకులు శశికిరణ్ తిక్క  .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: