ప్రముఖ తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కెరీర్ పరంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇది 15వ సినిమా.ఇక ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి, వైజాగ్, పంజాబ్ ఇంకా అలాగే హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో చిత్రీకరించారు. ఇప్పటివరకు కూడా 40శాతం షూటింగ్ పూర్తి చేసిన చిత్రబృందం త్వరలోనే కొత్త షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చెయ్యనుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంకా అలాగే వీడియోలు కూడా లీకవడంతో ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపిస్తారని స్పష్టంగా అర్ధమవుతుంది.అయితే ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, శంకర్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని సమాచారం తెలుస్తుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్లో మైలురాయి లా నిలిచిపోయే రంగస్థలానికి రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు. ఇక RC #15 కోసం రామకృష్ణ ప్లేస్ లో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ను శంకర్ తీసుకొచ్చారని అంటున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు రవీందర్ పని చేసారు.RC #15 నుండి రామకృష్ణ వెళ్లిపోయారని కానీ, రవీందర్ జాయిన్ అయ్యారని కానీ చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చెయ్యలేదు. ఇక ఢిల్లీ లో జరగబోయే కొత్త షెడ్యూల్ ప్రారంభమైతే కానీ ఈ విషయంపై క్లారిటీ వచ్చేలా లేదు.శంకర్ కి ఈమధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి. మొన్నామధ్య కమల్ హసన్ తో చేసిన ఇండియన్ 2 సినిమా విషయంలో కూడా శంకర్ తరచూ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోవడం ఇంకా ప్రొడ్యూసర్స్, కమల్ హాసన్ తో విభేదాలు రావడం కారణంగా ఆ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది.