70 కోట్లకు అమ్మితే నైజాం ఏరియాలో 'ఆర్ఆర్ఆర్' మూవీ కి వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ ,ఒలీవియా మోరిస్ హీరోయిన్ల లుగా అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర కని ప్రధాన పాత్రల్లో ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే.


మొదటి నుండి ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు ఉన్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో భాగంగా ఈ మూవీ కి నైజాం ఏరియా లో కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  'ఆర్ ఆర్ ఆర్' మూవీ కి నైజాం ఏరియాలో 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  అలా 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను నైజాం ఏరియాలో జరుపుకున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అదిరిపోయే బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో నైజాం ఏరియా బాక్సాఫీస్ బరిలో దిగింది. విడుదలైన మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లను సాధించింది.


అందులో భాగంగా నైజాం ఏరియా లో కూడా ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్ లను సాధించింది. నైజాం ఏరియా లో 100 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించి, నైజాం ఏరియా లో 100 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసిన మొట్ట మొదటి సినిమాగా  'ఆర్ ఆర్ ఆర్' మూవీ అదిరిపోయే రికార్డ్ ను సృష్టించింది. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 111.85 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. మొత్తం మీద ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 41 కోట్లకి పైగా లాభాలను తెచ్చుకొని నైజాం ఏరియాలో సెన్సేషనల్ కలెక్షన్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: