టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు' మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు . పెళ్లి చూపులు సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదలై భారీ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించింది . ఈ సినిమా తో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదించుకున్నాడు .
ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ' ఈ నగరానికి ఏమైంది ' ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ సినిమాలో నలుగురు స్నేహితుల మధ్య ఫ్రెండ్షిప్ ను చాలా అందంగా చూపించే మంచి విజయాన్ని అందుకున్నాడు . ఇలా వరుసగా రెండు విజయాలను దర్శకుడిగా అందు కున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కు కూడా దర్శకత్వం వహించ లేదు . కాక పోతే కొన్ని సినిమా లలో మాత్రం ప్రత్యేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే కొన్ని టీవీ షో లకు హోస్ట్ గా కూడా తరుణ్ భాస్కర్ వ్యవహరించాడు . ఇది ఇలా ఉంటే తాజాగా తరుణ్ భాస్కర్ తాను చేయబోయే ప్రాజెక్ట్ ల గురించి తెలి యజేశాడు.
తరుణ్ భాస్కర్ ఒక స్టార్ హీరో తో ఒక సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు . అలాగే ఒక క్రైమ్ సినిమాను తెరకెక్కించ బోతున్నట్లు చెప్పుకొచ్చాడు . అలాగే సోనీ లివ్ 'ఓ టి టి' సంస్థ కు ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నట్లు చెప్పుకొచ్చాడు . ఇలా తరుణ్ భాస్కర్ తాజాగా తాను తదుపరి చేయబోయే ప్రాజెక్ట్ ల గురించి వివరించాడు . ఇలా ఇన్ని రోజుల పాటు దర్శకత్వానికి దూరంగా ఉన్న తరుణ్ భాస్కర్ ఒకే సారి వరుస పెట్టి క్రేజీ మూవీ లను సెట్ చేసుకున్నాడు.