ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్' సెమీ ఫైనల్ కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన బాలకృష్ణ..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తెలుగు ప్రముఖ 'ఓ టి టి' ఆహా లో ఆన్ స్థాపబుల్ అనే టాక్ కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే.
 


బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆన్ స్థాపబుల్ టాక్ షో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకొని ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తెలుగు ప్రముఖ 'ఓ టి టి' ఆహ లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సెమి ఫైనల్ షో కు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు.  ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి. అసలు విషయం లోకి వెళితే... ఆహా 'ఓ టి టి' తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటు వంటి ప్రతిభావంతులైన సింగర్ లకి అవకాశం ఇచ్చేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం చాలా సహాయపడుతుంది.  


ఈ ప్రోగ్రాం కి టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్, సంగీత దర్శకుడు థమన్, సింగర్ కార్తీక్ లు జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ రామ చంద్ర ఈ ప్రోగ్రాం  కి హోస్ట్ గా నిర్వహిస్తున్నారు. అయితే ఈ తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం ప్రస్తుతం సెమీ ఫైనల్ కి చేరుకుంది. ఈ సెమీ ఫైనల్ కి స్పెషల్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ  విచ్చేశారు.  అందుకు సంబంధించిన ఫోటోలను ఆహా 'ఓ టి టి' సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: