సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న మహేష్ బాబు బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి వరస విజయాల తర్వాత భరత్ అనే నేను సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఆ తర్వాత వరుస పెట్టి మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న మహేష్ బాబు తాజాగా విడుదలయిన సర్కారు వారి పాట సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు మరికొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా.
ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా పీరియాడిక్ డ్రామా అని, ఫ్లాష్ బ్యాక్, లైవ్ సమానంగా సాగుతాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ జూన్ రెండో వారం నుండి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఫైట్ సన్నివేశం తో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ ఫైట్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.