తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే మొదట నెగటివ్ టాక్ వచ్చినా కూడా రోజులు గడుస్తున్నా కొద్ది పాజిటివ్ టాక్ వచ్చింది.ఇక రెండు వందల కోట్లకు పైగా నే వసూళ్ల ను సర్కారు వారి పాట వసూళ్లు చేసింది. అంతేకాదు భారీ అంచనాల నడుమ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మ్యూజికల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఇదిలావుంటే సర్కారు వారి పాట లోని మమ మహేష మరియు కళావతి సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఆ రెండు పాటలకు ఏమాత్రం తగ్గకుండా మురారి బావ అనే పాట సినిమా కోసం ట్యూన్ చేయడంతో పాటు షూట్ చేశారట. ఇకపోతే కాని ....సినిమా నిడివి సమస్య కారణంగా ఫైనల్ వర్షన్ లో మురారి బావ పాట ను పక్కకు పెట్టేశారు. కాగా దాంతో మురారి బావ పాట కోసం పడ్డ కష్టం అంతా వృదా అయ్యింది.ఇక మహేష్ బాబు ఆ పాట విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాడు. అయితే అందుకే ఆ పాటను ఖచ్చితంగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.అయితే ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్లు దాదాపుగా క్లోజ్ అయ్యాయి.
అందుకే మురారి బావ పాట విడుదల విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. మురారి బావ విడుదల ఉండక పోవచ్చు అనే అభిప్రాయంకు కొందరు వచ్చారు. అయితే మురారి బావ పాట ను కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేష్ బాబు అభిమానుల ముందుకు తీసుకు వచ్చేందుకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ పాట ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే అన్ని వర్గాల వారిని మురారి బావ పాట కు సంబంధించినంత వరకు ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు.