సీనియర్ హీరోయిన్ తో బాలయ్య సినిమా..

Satvika
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తూ బిజిగా ఉన్నారు. మొన్నీమధ్య వచ్చిన అఖండ సినిమా బాక్సాఫిస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే..ఆ సినిమా తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో రెండు, మూడు సినిమాలు చేస్తున్నాడు.ఇప్పుడు బాలయ్య నటిస్తున్న 108 వ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్.



ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా పూర్తికాగానే, బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ఇటీవల అనిల్ రావిపూడి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఈ సినిమాలో బాలయ్యతో కామెడీ చేయించేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా శ్రీలీలా పేరు వినిపించడంతో, ఆమె బాలయ్య కూతురి పాత్రలో ఈ సినిమాలో నటించబోతున్నట్లు అనిల్ రావిపూడి కన్ఫం చేశాడు. దీంతో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు...



అనిల్ రావిపూడి అప్పుడే పర్ఫెక్ట్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బాలయ్య సరసన సీనియర్ బ్యూటీ ప్రియమణిని హీరోయిన్‌గా తీసుకునేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. ప్రియమణి గతంలో బాలయ్య సరసన 'మిత్రుడు' అనే సినిమాలో నటించింది. ఇప్పుడు ఇంత కాలం తరువాత మళ్లీ బాలయ్యతో సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆమె కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాలో ప్రియమణి నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: