భర్త వదిలేస్తే ఏం చేస్తావన్న నెటిజెన్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన.. ప్రియాంక చోప్రా..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ గా మాజీ ప్రపంచ సుందరిగా పేరుపొందినది హీరోయిన్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఒక్కసారిగా హాలీవుడ్ లో కూడా తన స్థాయిని పెంచుతుంది. ఈ విధంగా బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ప్రియాంక చోప్రా. ఎలాంటి విషయమైనా సరే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలదు. ఇకపోతే కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకున్న ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈమె వయస్సులో తన కంటే చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనస్ ను ప్రేమించి వివాహం చేసుకున్నది. ప్రస్తుతం వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె నెటిజన్  ఒక వింత ప్రశ్న వేయడం జరిగింది ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రాను ప్రశ్నిస్తూ.. మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే మీరేం చేస్తారు అని షాకింగ్ ప్రశ్న అడిగారు. అందుకు తగ్గట్టుగానే ..దిమ్మతిరిగే సమాధానం కూడా తెలియజేసింది.

ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ఒక అబ్బాయి వేరే అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్న తర్వాత.. తనతో జీవితాంతం కొనసాగించాలా వద్దా అన్నది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అని తెలియజేసింది. ఇక తన విషయంలో అలాంటి వ్యక్తి తనకు దొరికితే పిచ్చి పిచ్చిగా కొట్టేస్తా అనే సమాధానం తెలిసింది. ఆ తరువాత ఏం చేస్తానో తనకే తెలియదని ఆ సమయంలో నేను హింసాత్మకంగా మారిపోతారు అంటూ సమాధానం తెలియజేసింది. దీంతో ఈ సమాధానం చూసిన ప్రతి ఒక్కరు భయపడిపోయారు అట. ఇలా తన విషయంలో మోసం జరిగితే అసలు సహించని పరోక్షంగా తెలియజేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు కామెంట్ రూపంలో తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: