సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చిన సీనియర్ స్టార్ హీరో!

Purushottham Vinay
వరుణ్ సందేశ్ ఇంకా నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఏమైంది ఈ వేళ' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది. మొదటి చిత్రంతోనే మంచి డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఆ తర్వాత ఏకంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ వంటి స్టార్ హీరోతో 'రచ్చ' అనే మాస్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో సంపత్ నంది ఇక స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయిపోతాడు అని అందరూ అనుకుంటే అలా జరగలేదు.ఇక మిడ్ రేంజ్ హీరో అయిన రవితేజతో `బెంగాల్ టైగర్` చిత్రాన్ని తెరకెక్కించాడు. అది కూడా పర్వాలేదు. కొంచెం బాగానే ఆడింది. ఆ తర్వాత కూడా సంపత్ కు స్టార్ హీరోతో చేసే ఛాన్స్ దక్కలేదు. ఈ క్రమంలో గోపీచంద్ తో `గౌతమ్ నంద` ఇంకా `సీటీమార్` వంటి రెండు సినిమాలు తెరకెక్కించాడు.సక్సెస్ రేటు ఎక్కువ కలిగిన దర్శకుడు అనిపించుకున్నప్పటికీ ఎందుకో సంపత్ స్టార్ హీరోలను పట్టలేకపోతున్నాడు.


కొద్దిరోజుల క్రితం దాకా సీనియర్ స్టార్ హీరో అయిన బాలకృష్ణతో కూడా సంపత్ నంది సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు.ఇక ఈ విషయాన్ని సంపత్ తన స్నేహితుల వద్ద కూడా చెప్పాడు. కానీ బాలకృష్ణ తన తర్వాతి సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీంతో మళ్ళీ హీరోల కోసం వేట మొదలుపెట్టాడు సంపత్ నంది. ఈ క్రమంలో కింగ్ నాగార్జునకి ఓ కథ వినిపించాడు. అది నాగ్ కు బాగా నచ్చిందని వినికిడి.వెంటనే ఈ ప్రాజెక్టు మనం చేస్తున్నాం అని కూడా నాగ్ దెబ్బకు చెప్పేశాడట.'మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జున `గరుడ వేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `ది ఘోస్ట్` అనే సినిమాని చేస్తున్నాడు.మరి చూడాలి నాగార్జునతో సంపత్ నంది ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: