రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మేజర్' మూవీ టిక్కెట్ ధరలను అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన అడవి శేషు తాజాగా మేజర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 26/11 దాడులలో వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
 

ఈ మూవీ ని మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మేజర్ చిత్ర బృందం ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును కల్పించిన విషయం  మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలు టికెట్ రేట్లు పెంచుకుని మంచి కలెక్షన్లను కూడా తెచ్చుకున్నాయి.

అయితే ఈ సినిమా విషయంలో మాత్రం టికెట్ రేట్లను ఎక్కువగా పెట్టడం లేదు అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం మాత్రమే కాకుండా, టికెట్ రేట్లను కూడా ప్రకటించింది. మేజర్ చిత్ర బృందం ప్రకటించిన టికెట్ రేట్లను చూసినట్లయితే... తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 మల్టీప్లెక్స్ లలో 195 రూపాయలుగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో మేజర్ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్ లాల్క్  147 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 177 రూపాయలుగా ఫిక్స్ చేసినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: