మోక్షజ్ఞ కు బదులు చైతన్యకృష్ణ వస్తున్నాడు !

Seetha Sailaja
నందమూరి అభిమానులు అంతా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ఈవిషయం పై క్లారిటీ ఇవ్వకుండా సంవత్సరాలు గడిపేస్తున్నాడు. దీనితో అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటుందా లేదా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి మరొక హీరో రాబోతున్నాడు అంటూ విడుదల చేయబడ్డ ఒక పోష్టర్ ను చూసి చాలామంది షాక్ అయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ‘బసవతారకం క్రియేషన్స్’ పేరు మీద ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి చైతన్యకృష్ణ హీరోగా ఒక సినిమాను ప్రారంభిస్తున్నారు.

నందమూరి తారకరామారావు కొడుకు జయకృష్ణ కుమారుడు ఈ చైతన్యకృష్ణ. గతంలో ఇతడిని హీరోగా పెట్టి ‘థమ్’ అనే మూవీ తీసినప్పటికీ ఆమూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడ ఎవరికీ తెలియదు. నందమూరి తారకరామారావు కుటుంబం నుండి తారకరత్న కళ్యాణ్ రామ్ లు హీరోలుగా రాణించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారెవ్వరు రాణించలేకపోయారు.

నందమూరి కుటుంబంలో ఒక్క బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లకు తప్ప మరెవ్వరికీ క్రేజ్ లేదు. అలాంటి పరిస్థితులలో ఎప్పుడో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన చైతన్యకృష్ణ ను మళ్ళీ హీరోగా లాంచ్ చేస్తూ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఎందుకు పెట్టారు అంటూ మరొకొందరు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఈ కుటుంబ సభ్యులు రామకృష్ణ స్టూడియో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎన్బీకే ఫిలిమ్స్ ఇలా చాల ప్రొడక్షన్ హౌస్ లు పెట్టారు. ఇప్పుడు ఇవి చాలక మరొక ప్రొడక్షన్ హౌస్ అవసరమా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి నందమూరి అభిమానులు బాలకృష్ణ జూనియర్ లు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. ఆకోరిక తీరే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. కనీసం మోక్షజ్ఞతో అయినా తమకు జోష్ వస్తుందని ఆశిస్తే అది తీరకుండా వారి కుటుంబం నుంచే మరో కొత్త హీరో రావడం ఆశ్చర్యంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: