'పక్కా కమర్షియల్' నుండి రెండో సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన గోపీచంద్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన సిటిమర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో గోపీచంద్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. సిటీ మార్ సినిమా మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కింది.
 

ఇది ఇలా ఉంటే సీటిమార్ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో జూలై 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను,  కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

 అసలు విషయం లోకి వెళితే...  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.  పక్కా కమర్షియల్ మూవీ లోని రెండో లిరికల్ సాంగ్ జూన్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పక్కా కమర్షియల్ అనే టైటిల్ సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంది. రెండవ లిరికల్ సాంగ్ ఏమేరకు ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి. ఈ సినిమాకు జాక్స్ బీజాయ్ సంగీతాన్ని సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: