వనవీర మూవీ రివ్యూ: పురాణాల టచ్.. సినిమా ఎలా ఉందంటే..?

Divya
అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం వనవీర. ఇందులో నందు, పృథ్వీ, శివాజీ రాజా, సత్య, కోన వెంకట్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి తదితరులు నటించారు. అవినాష్ తిరువీధుల దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మొదట వానర అనే టైటిల్ తో బాగా ప్రచారం జరిగింది. కానీ సెన్సార్ బోర్డు కంటెంట్ చూసి ఆ టైటిల్ కి అభ్యంతరం చెప్పడంతో వనవీర అనే టైటిల్ని మార్చారు. ఈ సినిమా జనవరి 1, 2026 లో థియేటర్లో విడుదలయ్యింది. మరి ఎలా ఉందో చూద్దాం.


స్టోరీ విషయానికి వస్తే:
వనపురానికి చెందిన ఒక మధ్య తరగతి అబ్బాయిగా రఘు (అవినాష్) ఓ ఊరిలో ఖాళీగా తన మరదలు (సిమ్రాన్ చౌదరి) తో కలిసి తిరుగుతూ ఉంటాడు. రఘు తండ్రిగా (శివాజీ రాజా) దుబాయ్ లో ఉన్న తన పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో ఊర్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న దేవా (నందు) పార్టీ పెద్దల ముందు తన బలాన్ని చూపించడం కోసం బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అందుకోసం బైకులు కావాల్సి ఉండడంతో దేవా మనసులు రఘు బైకును కూడా చాలా రిక్వెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అయితే ఆ తర్వాత అ బైక్ తిరిగి ఇవ్వకపోవడంతో తన దగ్గర నుంచి బైక్ తీసుకున్న బసవన్న (ప్రభాకర్) వెనకే బైకు కోసం తిరుగుతూ అలా దేవా అడ్డాలోకి అడుగు పెడతాడు రఘు. ఆ తర్వాత ఏం జరిగింది? బైక్ కోసం వెళ్లిన రఘును  దేవా  పార్టీలోకి ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చింది? ఎమ్మెల్యే కావాలనుకున్న దేవాను దెబ్బతీసేందుకు ఎందుకు రఘు సిద్ధమయ్యారు ? అసలు దేవాకు, రఘుకు ఉన్న విరోధమేంటి? వనపురంలో కుల రాజకీయ కథేంటి? ఈ కథ రామాయణంలోని వానర్ జాతికి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన స్టోరీ?


ఎలా ఉందంటే:
కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాలన్నీ పౌరాణిక గాధాలతో ముడి పెట్టడం ఈమధ్య ఎక్కువగా మారిపోయింది. అయితే కొన్ని సందర్భాలలో ఇలాంటి ట్రైలర్, టీజర్ లో చూపించి సినిమా విడుదలైన తర్వాత మరొక లాగా ఉంటే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు వనవీర చిత్ర విషయంలో కూడా అలాంటి పొరపాట్లు జరిగాయి. కుల విపక్ష నేపథ్యంలో గ్రామీణ రాజకీయాలు చుట్టూ జరిగేటువంటి కథని రామాయణంలోని వాన జాతి కథతో ముడిపెట్టి వాటిని తెరపై చూపించాలనుకునే కాన్సెప్ట్ బాగున్న  వనవీర అనే టైటిల్ పెట్టి కుల పిచ్చి అని, కొన్ని కులాలను మరి తక్కువగా చేసి చూపించినట్లుగా చూపించారు. ఇందులో కొన్ని సీన్స్ చూస్తే సుమారుగా 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. మొదటి భాగం అంత హీరో, హీరోయిన్, కుటుంబ పరిచయం బైక్ కథతోనే సాగుతుంది. సెకండాఫ్ రెగ్యులర్ ట్విస్టులు, కుల కథలు రొటీన్ ఫ్లాష్ బ్యాక్ లతోనే కనిపిస్తాయి. ఇలాంటి కథకు  వనవీర అనే టైటిల్ పెట్టి.. చివరిలో డివోషనల్ సినిమాలగే హైట్ కోసం హనుమంతుడి రిఫరెన్స్ ని తీసుకువచ్చారు. సినిమాలో సత్య కామెడీ తప్ప మిగిలిన వారే ఎవరిది కూడా వర్కౌట్ కాలేదు.


నటీనటుల యాక్టింగ్:
హీరోగా డైరెక్టర్ గా అవినాష్ తన పాత్రకు న్యాయం చేశారు విలన్ గా నందు అద్భుతంగా మెప్పించారు. ఈ సినిమా తర్వాత నందుకు భవిష్యత్తులో నెగిటివ్ రోల్ పాత్రలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిమ్రాన్ చౌదరి అక్కడక్కడ గ్రామీణ యువతీగా బాగానే ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో శివాజీ రాజా అద్భుతంగా నటించారు. అలాగే ఆమని, ప్రభాకర్ మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రలో అద్భుతంగా నటించారు.

బలాలు:
అవినాష్, నందు నటన
ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్
ద్వితీయార్థంలో కొన్ని మలుపులు

మైనస్:
ఊహలకు తగ్గట్టుగానే సాగే స్టోరీ
ఆకట్టుకోలేని ఎమోషనల్ సన్నివేశాలు.
 

రేటింగ్:
2.2/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: