గరుడవేగ-2 రావడం ఖాయమే.. ఎప్పుడంటే..!!

Divya
హీరో రాజశేఖర్ ఆ మధ్య వరుస ఫ్లాప్ లతో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో గరుడవేగ సినిమా వచ్చి మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వహించిన ఈ చిత్రం భారీ ఘన విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత మంచి లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా పేరు పొందింది. ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ కూడా మంచి ఫిట్నెస్తో కనిపించారు ఆయన ఎప్పుడు యాంగ్రీ యంగ్ మేన్ అనిపించుకునేలా చేశారు. ఈ సినిమా హిట్ ఇచ్చిన సంతోషంలో రాజశేఖర్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతూ మరికొన్ని సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా  రాజశేఖర్ మాట్లాడుతూ.. వెంటవెంటనే పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేస్తే ఆడియన్స్ కూడా చాలా బోర్ గా ఫీల్ అవుతారని తాను అనుకోనని ఎందుకంటే.. కథలు పాత్రలో కొత్తదనం ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు అలా అనుకోవాలని తెలిపారు. అందుచేతనే తను పోలీస్ ఆఫీసర్ గా చేసిన పాత్రలను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారని తెలిపారు. ఇప్పటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనని కూడా తమలో ఒకరిగా భావిస్తూ ఉంటారు అని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన కథని హీరో గా భావిస్తూ చేస్తూ ఉంటాను కనుక కొంత కాలం పాటు తన ఇంట్రెస్ట్ గా ఉండడానికి కారణం ఇదే అని తెలిపారు.
ఇక ఎంతో మంది కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో విలన్ నటిస్తున్నారంట కదా.. వచ్చి వాళ్ళు అడుగుతారేమో అని అనుకుంటున్నాను అని తెలిపారు గతంలో కూడా ఇలా ఎదురు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయని తెలిపారు. కానీ ఇంతవరకు ఆ చిత్రానికి సంబంధించి తననెవరూ సంప్రదించలేదని తెలిపారు. కొరటాల శివ సినిమాలో తనకు పని చేయాలని ఉంది కానీ ఆయన అడిగితే నా పాత్ర నచ్చితే తప్పకుండా చేస్తానని తెలిపారు. ఇంతవరకు తన సినిమాలలో దేనికి సిగ్నల్ చేయలేదు కానీ గరుడవేగ సినిమాకి మాత్రం సీక్వెల్ చేయబోతున్న ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్ట బోతున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: