అఖండ : సరికొత్త రికార్డు!

Purushottham Vinay
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ సినిమా విడుదల అయ్యి కూడా చాలా నెలలు అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ లో కూడా వచ్చేసింది.. అలాగే శాటిలైట్ లో కూడా ఈ సినిమా టెలికాస్ట్‌ అయ్యింది. అన్ని చోట్ల కూడా మంచి ఈ సినిమాకు స్పందన వచ్చింది అనడంలో అసలు ఎలాంటి సందేహం కూడా లేదు. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ సినిమా తాజాగా మరో సూపర్ డూపర్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా ను అత్యధిక థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకునేలా ఆ మూవీ మేకర్స్ చేశారు. అలాగే సినిమా కు వంద రోజులు కూడా మంచి నెంబర్‌ అనేది దక్కింది. ఇప్పుడు ఏకంగా  175 డేస్ ఆడిన సినిమా గా కూడా అఖండ సినిమా చరిత్రలో నిలిచింది. ఇక ఈ మద్య కాలంలో 175 రోజుల సినిమా అంటే ఖచ్చితంగా కాస్త జోక్‌ గానే అనిపిస్తుంది.కానీ అఖండ సినిమా ఆ రికార్డుని సాధించి చూపించింది.రెండు దశాబ్దాల క్రితం దాకా కూడా 175 రోజులు అనేది సూపర్‌ హిట్‌ సినిమాకు చాలా కామన్‌ విషయం.


కాని ఇప్పుడు అలా కాదు. పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి.అఖండ సినిమా ను ఒక థియేటర్ లో 175 రోజుల పాటు ఆడించేందుకు మేకర్స్ ఎంతగా కష్టపడ్డారో ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బాల కృష్ణ అభిమానులు ఇంకా అలాగే మూవీ మేకర్స్ కలిసి అఖండ సినిమాను ఆ స్థాయిలో నిలబెట్టి..ఎంతో అరుదైన రికార్డును కట్టబెట్టారు. దాంతో ఆయన అభిమానులు ఇంకా యూనిట్‌ సభ్యులను ఈ రికార్డుని తట్టుకోలేక నెటిజన్స్ ట్రోల్‌ చేస్తున్నారు. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు అంటూ కొంత మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకి యస్ యస్ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో ఇచ్చిన మ్యూజిక్ కి అయితే థియేటర్ లలో బాక్స్ లు బద్దలు అయిపోయాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: