పూజాహెగ్డే సాంగ్ మాములుగా లేదుగా..సూపర్..

Satvika
తెలుగు టాప్ హీరోయిన్ల లో ఒకరు పూజాహెగ్డే.. ఈ అమ్మడు ఒకప్పుడు ఓ ఊపు ఊపెసింది. దాంతో సినిమాలను చెసెందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపించారు. కానీ ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్నీ కూడా భారీ డిజాస్టర్ అవుతున్నాయి. ఒకవైపు సినిమా ల పై ఫోకస్ పెడుతూనే మరో వైపు ఐటమ్ సాంగ్ లను కూడా చేస్తూ వస్తుంది.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ 'ఎఫ్2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.


ఈ సినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కించారు.ఆ సినిమానే ఎఫ్3 మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మరింత ఫన్‌తో నింపి ప్రక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు పూర్తి ఫన్ ఇచ్చేందుకు అనిల్ రావిపూడి అండ్ గ్యాంగ్ సిద్ధమయ్యారు.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను అప్పుడే చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఎఫ్3 సినిమాలోని పాటలను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే లబ్బు డబ్బు, ఊ ఆ ఆహా ఆహా అనే పాటలతో రచ్చ చేసిన ఎఫ్ 3 టీమ్.. తాజాగా తమన్నా స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేసింది.

 
పార్టీ సాంగ్ గా తెరకెక్కించిన ఈ పాట.. లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా అంటూ లిరికల్ తో మొదలైంది. ఈ సాంగ్ లో పూజాహెగ్డే మెరిసింది.ఒక వ్యక్తి పెద్ద కలలను కలిగి ఉండాలని, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశాన్ని ఇస్తున్న ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి పాడారు. స్పైసీ సైరన్ పూజా హెగ్డే ఈ పాటలో గ్లామర్ విందును అందిస్తోంది. ఈ పాటతో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రిన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా సోనాల్ చౌహన్ కూడా మరో పాత్రలో నటించింది.మరి ఈ సినిమా ఎంత హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: