అభిమానులతో తన కొడుకు ఫోటోలు పంచుకున్న కాజల్ అగర్వాల్.. సో క్యూట్ అంటూ..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ గత నెలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఇక ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ఆమె తన కొడుకు ఫోటోలను తొలిసారి అభిమానులతో పంచుకున్నారు. ఒక కాజల్ అగర్వాల్ తన కొడుకు పేరు నీల్ కిచ్లూ గా పరిచయం చేసిన విషయం తెలిసిందే ఇకపోతే కాజల్ అగర్వాల్ బిడ్డకు జన్మనివ్వడం తో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఇక గర్భవతి అయిన రోజు నుండి కాజల్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఇక 2020  అక్టోబర్ నెలలో కాజల్ అగర్వాల్..  గౌతమ్ కీచ్లూ ను వివాహం చేసుకుంది.. ఇక కొడుకు జన్మించడంతో ఈమె పూర్తిగా సినిమాలకు దూరం కాబోతుంది అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే మదర్స్ డే సందర్భంగా తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది కాస్తా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి అంతే కాదు కాజల్ అగర్వాల్ కొడుకు చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ ఎంతగానో మురిసిపోతున్నారు అభిమానులు.
కాజల్ కి కూడా చాలామంది అభిమానులు మదర్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేయడం గమనార్హం. ఆమె బిడ్డ కోసం కొన్ని నెలలు సమయం గడిపి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా తను షేర్ చేసిన ఫోటోలలో కొడుకు ముఖం పూర్తిగా కనిపించకుండా కొంతమేర వీరు దాచి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆచార్య సినిమాలో ఉంది అని చెప్పి చివర్లో ఆమె పాత్రను తొలగించడంపై కాజల్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలగా.. కాజల్ అగర్వాల్ మాత్రం సేఫ్ అయ్యిందని చెప్పవచ్చు. మొత్తానికి లక్కీగా తప్పించుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కొడుకుతో సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

SON

సంబంధిత వార్తలు: