మహేష్ పై ప్రశంసలు కురిపించిన అనిల్ రావిపూడి..
ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా షూటింగ్ పూర్తి అయిన నాటి నుంచి సినిమా ను జనాల్లొకి తీసుకెల్లాలని చిత్రబృందం ప్రమోషన్స్‌ను కొత్తగా ప్లాను చేసింది. అనుకున్న విధంగా సినిమా పై జనాలకు హైప్ ను క్రియేట్ చేసింది.ఈ మేరకు ఈ నెల 7 న చిత్ర ప్రీరిలిజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఎందరో సినీ ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డైరెక్టర్ ఈ సినిమాకి ముందు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలంటే 50 శాతం మ్యూజిక్ మీదే ఆధారపడుతుంది. తమన్ ఆల్రెడీ ఈ సినిమాకి సగం హిట్ ఇచ్చాడు. ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరికీ అల్ ది బెస్ట్. మహేష్ గారితో పని చేయడం ఒక కిక్ లాంటిది. ఆయనతో మళ్ళీ ఎప్పుడెప్పుడు సినిమా తీయాలి అని ఎదురు చూస్తున్నాను. నేను మహేష్ గారితో తీసిన సరిలేరు నీకెవ్వరూ సినిమా కంటే కూడా ఇది పెద్ద హిట్ అవ్వాలి. సర్కారు వారి పాట కాదు ఇది మహేష్ వారి పాట ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడం ఖాయం అంటూ మహేష్ పై ప్రశంసలు కురిపించారు.అతని మాటలు సినిమాకు మంచి హైప్ ను క్రియేట్ చేసింది.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..