షిరిడి సాయి సన్నిధిలో ప్రేమ పక్షులు.. ఎవరంటే..!!

Divya
స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో నయనతార కూడా ఒకరు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ది ఈ ముద్దుగుమ్మ. ఇక లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 19 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇప్పటికి వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది ఈ నటి. సినిమాల విషయంలో ఎప్పుడూ బిజీగా ఉండే నయనతార.. తన వ్యక్తిగత జీవిత విషయంలో మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నది.


ముఖ్యంగా ప్రియుడు విగ్నేష్ శివన్ తో ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. గతంలో రెండు సార్లు ప్రేమ వ్యవహారంలో ఎదురు దెబ్బలు తిన్న నయనతార ఇక జీవితమంతా ప్రశాంతంగా ఉండేందుకు విగ్నేష్ తో గడపాలని ఆలోచనలో ఉంది. అందుకు నిదర్శనంగా వీరిద్దరూ కలిసి జీవిస్తున్న విధానాన్ని బట్టి చెప్పవచ్చు. ఇక ఎంతో కాలం నుండి ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి విషయం పై ఇంకా క్లారిటీ గా ఏ విషయాన్ని తెలియజేయడం లేదు. అయితే గతంలో పలు సార్లు వీరిద్దరూ వివాహం అయినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట.
ఇక నయనతార ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపించడంతో ఒక్కసారిగా అందరూ నిశ్చితార్థం కూడా అయిపోయింది అయితే త్వరలోనే వివాహమని టాక్ వినిపించింది. ఇక వీరికి ఇలాంటి తీరిక సమయం దొరికినా సరే రెక్కలు కట్టుకొని మరీ ఎగిరిపోయే ప్రేమ పక్షుల తయారయ్యారు. తాజాగా నిన్నటి రోజున శిరిడి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతర గుడి ప్రాంగణంలో దిగిన ఫోటో అభిమానులతో పంచుకోవడం జరిగింది విగ్నేష్  శివన్. ఇక అంతే కాకుండా షిరిడీలో నా కన్మనీతో.. శిరిడి సాయి ని దర్శించుకోవడం చాలా అద్భుతంగా భావిస్తున్నాను అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: