దేశంలోకి కరోనా ఎంటర్ కాకా ముందు సినీ ప్రేక్షకులు సినిమాలను చూడడానికి ఎక్కువగా థియేటర్ లపై ఆధారపడేవారు. దేశంలోకి కారోనా ఎంటర్ కాక ముందు 'ఓ టి టి' ల వినియోగానికి సినీ ప్రేమికులు చాలా తక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేశం లోకి కారోనా ఎంటర్ అయిందో అప్పటి నుండి సినీ ప్రేక్షకులు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో మూవీ లను చూడడానికి బాగా అలవాటు పడిపోయారు.
అలా అలవాటు పడడానికి ప్రధాన కారణం దేశం లోకి కారోనా ఎంటర్ అయిన తర్వాత ప్రభుత్వాలు థియేటర్ లపై కొన్ని ఆంక్షలను విధించడం, అలాగే కారోనా కేసులు ఉదృతంగా పెరిగిన నేపథ్యంలో కొంత కాలం పాటు థియేటర్ లను పూర్తిగా మూసి వేయడం ,ఆ తర్వాత థియేటర్ లలో సినిమాలను ప్రదర్శించిన ప్పటికీ వాటిపై ఆంక్షలు విధించడంతో సినీ ప్రేక్షకులు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో మూవీ లను చూడడానికి అలవాటు పడిపోయారు. ప్రస్తుతం కూడా సినీ ప్రేక్షకులు 'ఓ టి టి' లో సినిమాలు చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
దానితో 'ఓ టి టి' సంస్థలు కూడా పోటీ పడి ప్రేక్షకుల ముందుకు మంచి మంచి కంటెంట్ ను తీసుకువస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ అదిరిపోయే ఒక న్యూస్ ను ప్రకటించింది. ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఒక మే నెలలోనే 30 కి పైగా హాలీవుడ్ సినిమాలను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ 30 సినిమాల వివరాలను కూడా తెలియజేసింది. అనకొండ', 'బ్యాడ్ బాయ్స్ 2', 'చార్లీస్ ఏంజెల్స్', 'మెన్ ఇన్ బ్లాక్', 'స్పైడర్ మ్యాన్', 'టెర్మినేటర్', 'రెసిడెంట్ ఈవిల్ తో పాటు మరికొన్ని హాలీవుడ్ సినిమాలను మే నెలలో విడుదల చేయనున్నట్లు ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ తాజాగా ప్రకటించింది.