పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ అభిమానుల కోరిక మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తిరిగి వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన వఖిల్ సబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ 'వఖిల్ సబ్' మూవీ తర్వాత భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలను దాదాపుగా ఒకే సారి ప్రారంభించాడు.
కాకపోతే పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ ని పక్కన పెట్టి భీమ్లా నాయక్ మూవీ పై ఇంట్రెస్ట్ పెట్టాడు. దానితో భీమ్లా నాయక్ సినిమా ఇప్పటికే పూర్తి అయ్యి విడుదల కూడా అయ్యింది. కానీ హరిహర వీరమల్లు సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యి నిలిచిపోయింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ సినిమా కోసం భారీ సెట్ లను చిత్ర బృందం నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభం అయిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఒక షెడ్యూలు ను కూడా పూర్తి చేసుకుంది. మరొక షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి వెయ్యి మంది పోరాటం సన్నివేశాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే షెడ్యూల్ షెడ్యూల్ కు మధ్య పెద్దగా గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొని ఈ మూవీ ని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం వేసుకున్న ప్రణాళిక ప్రకారం కనుక ఈ సినిమా షూటింగ్ జరిగినట్లు అయితే ఈ సినిమా దసరా కు గాని సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.