బండ్ల గణేష్ ఆ డైరెక్టర్ ని టార్గెట్ చేశారా..?

Divya
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ లో ఒకరైన బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సినిమా నిర్మాణానికి చాలా దూరంగా ఉంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వీరాభిమానులలో ఈయన కూడా ఒకరు. బండ్ల గణేష్ మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలోని మాటలు ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ సినిమా చేయాడన్ వార్తలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై కూడా బండ్లగణేష్ తాజాగా మాట్లాడడం జరిగింది.

కేవలం పవన్ కళ్యాణ్ త్వరగానే సీఎం కావాలని తాను కోరుకుంటున్నానని అందుచేతనే ఆయన సినిమాల్లో నటించకూడదని కేవలం రాజకీయాల పైన దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు గా బండ్ల గణేష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ సీఎం అయినంత మాత్రాన తనకు పదవి వస్తుందని ఆశ పడలేదని ఆయన తెలియజేశారు. తమకు ఎంపీ పదవులు, ఎమ్మెల్సీ పదవులు అవసరం లేదని బండ్లగణేష్ చేసిన ఈ కామెంట్ చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రేజ్ చాలా బాగుందని ఆయన కామెంట్లు చేశారు. మరొకవైపు స్టార్ డైరెక్టర్ తో బండ్ల గణేష్ కు విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు వినిపించాయి.
అయితే ఆ వార్తలపై బండ్లగణేష్ స్పందిస్తూ నాగార్జున సాగర్ డ్యామ్ లాంటివాడిని డ్యామ్ లోకి ఎన్నో నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి.. అలా డైరెక్టర్లను నీళ్లతో పోలుస్తూ కామెంట్లు చేశారు బండ్ల గణేష్. తను సినిమాను నిర్మించిన ఒక సినిమా డైరెక్టర్ గురించి బండ్ల గణేశ్ ఇలా విమర్శలు చేసినట్లు సమాచారం. కృతజ్ఞత లేని వ్యక్తులకు తాను ఎప్పుడూ దూరంగానే ఉంటానని అలాంటివారు మనుషులు కూడా కారని తెలియజేశారు. అన్నం పెట్టిన నిర్మాతలనే అవమానించే విధంగా మాట్లాడితే కన్న తల్లికి ద్రోహం చేసినట్లే అవుతుందని తెలిపారు బండ్లగణేష్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు బండ్లగణేష్. తను నటించిన డేగల బాబ్జి సినిమా త్వరలోనే విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: