వామ్మో:రెచ్చిపోతున్న రష్మిక.. కారణం ఏమిటంటే..!!

Divya
ప్రస్తుతం హీరోయిన్ రష్మీ క కి యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వెండి తెరపై ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ అని చెప్పవచ్చు. ఇక ఈ ముద్దుగుమ్మ అంటే ఇష్టపడని కుర్రకారులో లేరు. అందానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో రష్మిక ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక కన్నడలో కూడా తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత తెలుగులో ఛలో సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పట్నుంచి ఇమే ఏ సినిమాలో నటించిన కూడా ఆ చిత్రం హిట్ గా నిలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ప్లేస్ లో మూడో వరుసలో ఉన్నది.

అయితే ప్రస్తుతం బాలీవుడ్లో కూడా కొన్ని చిత్రాలు చేసినప్పటికీ అవి ఇంకా విడుదల కాలేదు. అయినా కూడా రష్మిక కు దేశ వ్యాప్తంగా ఒక రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అభిమానులు ఆమెను బాగా ఆరాధిస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పేరుపొందిన రష్మిక.. పుష్ప -2 లో నటించడానికి సిద్ధంగా ఉన్నది. ఇక ఈ చిత్రం అయిపోతుందని ఎన్టీఆర్- కొరటాల శివ కుమార్, చరణ్ ,నాగచైతన్య తదితర హీరోలతో నటించేందుకు సిద్ధంగా ఉన్నది.

ఒకవైపు కన్నడ ,తెలుగు ,బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉండగానే తమిళంలోనూ తన హవా కొనసాగించాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. తమిళంలో మొదటిగా కార్తీ సరసన సుల్తాన్ సినిమాలో నటించింది కానీ ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అందుచేతనే రష్మిక కాస్త గ్యాప్ తీసుకుని విజయ్ తో కలిసి ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మరో తెలుగులో తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత తమిళంలో కూడా ఈమె పాగా వేయడం ఖాయం అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సౌత్ లో కూడా మంచి పొజిషన్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: