దేవి నాగవల్లి సర్కార్ కన్నా పవర్ ఫుల్: ఆర్జీవీ

VAMSI
" data-original-embed="" >

ఈ రోజు విశ్వక్ సేన్ కు దెబ్బ మీద తగలడం చర్చనీయాంశం అయింది. తాను నటించిన మూవీ "అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమా ఈ శుక్రవారం థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రమోషన్ చేసే సందర్భంలో కొంచెం కొత్తగా ఆలోచించిన విశ్వక్ సేన్... ఈ మధ్య మూవీ రివ్యూ లను లేటెస్ట్ గా వైరల్ అయిన వ్యక్తితో ఒక ఫ్రాంక్ ను ప్లాన్ చేశాడు. అయితే ఇది ఇన్ని మలుపులకు కారణం అవుతుంది అని ఊహించలేకపోయాడు. అందులో భాగంగా చేసిన ఫ్రాంక్ వలన రోడ్డు మీద ట్రఫిక్ అవడంతో కొంచెం న్యూసెన్స్ క్రియేట్ అయింది. దీనిపై ఒక లాయర్ అతనిపై కేసు కూడా నమోదు చేశాడు. ఈ విషయాన్ని చర్చించడం కోసం టీవీ 9 కు ఆహ్వానించబడ్డారు విశ్వక్.

ఈయనను ప్రముఖ యాంకర్  దేవి నాగవల్లి ఇంటర్వ్యూ చేసింది. అయితే చర్చ మధ్యలో చిన్న పాటి సంఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఒక చిన్న విషయం గురించి చర్చించుకునే మార్గంలో సరిగా అర్ధం చేసుకోలేక ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. దీనితో యాంకర్ దేవి నాగవల్లి స్టూడియో నుండి దొబ్బేయమని విశ్వక్ సేన్ ను అనడంతో విశ్వక్ కూడా తనను గట్టి గట్టిగా అరుస్తూ స్టూడియోను వీడాడు ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇప్పుడు మన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు.

ఇంతకు ముందు వరకు పురుషుడు కన్నా మహిళా శక్తివంతం అని పురాణాలలో, పుస్తకాలలో విన్నాను కానీ ఈ రోజు ఒక సంఘటన ద్వారా తెలుసుకున్నాను అని కితాబిచ్చాడు. ఈ రోజు విశ్వక్ మరియు దేవి నాగవల్లి కి జరిగిన వివాదంలో ఆమె చాలా పవర్ ఫుల్ గా కనిపించించని కామెంట్ చేశాడు. ఈమె ప్రభుత్వాలకు ఏమీ తక్కువ కాదు అని  పొగడకనే పొగిడాడు. ఈ విధంగా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు... ఇందులో దేవి నాగవల్లిని కూడా ట్యాగ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: