అయోమయంలో టాలీవుడ్ !

frame అయోమయంలో టాలీవుడ్ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డుల స్థాయిలో కలక్షన్స్ సాధించినా ‘కేజీ ఎఫ్ 2’ లాంటి డబ్బింగ్ సినిమా భారీ విజయాన్ని నయోదుచేసుకున్నా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో జోష్ కనిపించడం లేదు. దీనికికారణం సగటు ప్రేక్షకుడుకు బాగా నచ్చి టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న భారీ సినిమాలకు ప్రేక్షకులు వస్తున్నారు కానీ టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా టాప్ హీరోల భారీ సినిమాలను కూడ ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా రిజక్ట్ చేస్తున్నారు.


‘ఆచార్య’ మూవీ భారీ ఫ్లాప్ గా మారడంతో ఈమూవీ బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది. ‘ఆర్ ఆర్ ఆర్’ కు ముందు విడుదలైన ‘రాథే శ్యామ్’ కూడ ఫెయిల్ కావడంతో ఆమూవీ బయ్యర్లకు కూడ నష్టాలు వచ్చాయి. ‘భీమ్లా నాయక్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీ బయ్యర్లకు కేవలం అసలు వడ్డీలు మాత్రమే గిట్టాయి కానీ లాభాలు ఏమాత్రం రాలేదు అన్న ప్రచారం కూడ ఉంది.


దీనితో టాప్ హీరోల భారీ సినిమాలు ఎందుకు కొంటున్నాము అనే కన్ఫ్యూజన్ లో చాలామంది బయ్యర్లు ఉన్నట్లు టాక్. భారీ సినిమాల పరిస్థితి ఇలా ఉంటే చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి మరింత అయోమయంగా ఉంది. టాప్ హీరోల సినిమాల గ్యాప్ మధ్య విడుదల అవుతున్న చిన్న మీడియం రేంజ్ సినిమాలు వారానికి మూడు నాలుగు చొప్పున ఒకదాని పై ఒకటి పోటీ విడుదల అవుతున్నాయి. దీనితో ఆసినిమాలు అన్నీ నష్టపోతున్నాయి.


టాప్ హీరోల సినిమాల గ్యాప్ మధ్య ఆమధ్య విడుదలైన ‘గని’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఆమూవీ బయ్యర్లు విపరీతంగా నష్టపోయారు. దీనితో ఇండస్ట్రీలో అటు భారీ సినిమాల బయ్యర్లు కానీ ఇటు చిన్నసినిమాల బయ్యర్లు కానీ ఎవరు సంతోషంగా లేరు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి హిట్ అయ్యే చిన్నసినిమాలు హిట్ అవుతాయో అవ్వవో తెలియని మీడియం రేంజ్ భారీ సినిమాలను నమ్ముకుని బయ్యర్లు విపరీతంగా నష్టపోతుంటే ఆమూవీలలో నటించిన నటీనటులు టెక్నిషియన్స్ భారీ పారితోషికాలు అందుకునే విచిత్ర పరిస్థితులలో టాలీవుడ్ పరిస్థితి ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: