మెగాస్టార్ కు ఆ సెంటిమెంట్ తోనే ఆచార్య ఫ్లాప్ అయ్యిందా..?

Divya
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు చాలా పెద్ద పీట వేస్తూ ఉంటారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా పూర్తి అయ్యే వరకు ప్రతి విషయంలో కూడా చాలా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు చిత్రబృందం. కొంతమంది టైమ్ అని సెంటిమెంట్గా భావిస్తే, మరికొంతమంది డేట్లను సెంటిమెంట్గా భావిస్తే, మరి కొంతమంది పండుగలను కూడా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది మాత్రం సినిమా టైటిల్ లో వచ్చే తొలి అక్షరం కూడా సెంటిమెంట్గా భావిస్తూనే ఉంటారు. అయితే అలా ఎంతో మంది హీరోలు సైతం వారికి అచ్చొచ్చిన అక్షరంతో సినిమా టైటిల్ ను పెట్టుకుని మంచి హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు.
రాజశేఖర్ సినిమాల విషయానికి వస్తే అ..ఆ అనే అక్షరం ఆయనకు సెంటిమెంట్ అని చెప్పవచ్చు.. ఆహుతి, అంకుశం, అక్క మొగుడు, ఆగ్రహం, అల్లరి ప్రియుడు, ఇలా తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక చిరంజీవి కెరీర్ ప్రారంభం నుంచి ఆ అనే అక్షరం కలిసి రావడం లేదు. చిరంజీవి నటించిన 11 వ చిత్రం అగ్ని సంసారం.. ఇందులో కవిత, సుహాసిని హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక అటు తర్వాత ఆరని మంటలు సినిమాని కూడా చేశారు కానీ అది కూడా నిరాశ చూపించింది. ఇక డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆలయ శిఖరం సినిమా కూడ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తమిళ డైరెక్టర్ భారతీరాజా తో కలిసి ఆరాధన సినిమా చేయడం అప్పట్లో ప్లాప్ గా నిలిచింది. కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో ఆపద్బాంధవుడు సినిమా తెరకెక్కించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. దీంతో చిరంజీవికి ఆ అనే సెంటిమెంట్ వల్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి. తాజాగా విడుదలైన ఆచార్య సినిమా కూడా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు కానీ ఆ అక్షరం కూడా సెంటిమెంట్ను ఫాలో అయ్యింది. దీంతో చిరంజీవికి ఆ అనే అక్షరం అచ్చి రాలేదని ఫ్యాన్స్ నమ్ముతున్నారు అయితే అడవి దొంగ, అన్నయ్య, అల్లుడా మజాకా తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్నారు చిరంజీ. అయితే ఆ అనే అక్షరం మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: