ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వరుస భారీ చిత్రాలను చేస్తున్న ప్రభాస్ ఈ చిన్న బడ్జెట్ సినిమాను ఒప్పుకోవడం నిజంగా విశేషం. స్టోరీ లో ఎంత దమ్ముండో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. గత కొన్ని రోజులుగా మారుతి చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమా తరువాత ఈ చిత్రాన్ని చేయబోతున్నాడనే వార్తలు రాగా ఇప్పుడు ఈ సినిమా తెరకెక్కుతోంది అని వార్తలు వస్తూ ఉండడం విశేషం.
ప్రస్తుతం సలార్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తరువాత ఈ సినిమా కు షిఫ్ట్ అవుతున్నాడు. కేవలం రెండు నెలల సమయం లోనే ఈ చిత్రాన్ని చేయాలనేది ప్రభాస్ ఆలోచన. అంతేకాదు ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు ఈ సినిమాను మొదలుపెట్టి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు.
సర్జరీ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన ప్రభాస్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మేలో సలార్ చిత్రం యొక్క షూటింగును మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత మారుతి సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ తన తదుపరి సినిమాలను చేసే విధంగా ప్లాన్ చేసాడు. వచ్చే నెలలో నాగ్ అశ్వి న్ దర్శకత్వం లోని సినిమాను అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోని సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఈ రకంగా ఆయన ఒకేసారి ఐదు సినిమాలను చేస్తూ గతంలో ఎప్పుడూ లేనంత బిజీగా ఉంటున్నాడు.