బర్త్ డే స్పెషల్: దేవకన్యలా మెరిసిపోతున్న సమంత..!!

frame బర్త్ డే స్పెషల్: దేవకన్యలా మెరిసిపోతున్న సమంత..!!

Divya
 హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుంటున్ననని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. చైతు కూడా విడిపోతున్నానంటూ ప్రకటన చేయడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా వీరు విడిపోకూడదని కోరుకొంటున్నారు. అయితే ఆ తర్వాత నుంచి సమంత కెరియర్ చాలా స్పీడందుకుంది. తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న కొన్ని మార్పులను స్వీకరిస్తూనే సమంత తన సినీ జీవితంలో బిజీగా గడుపుతోంది. ఇటీవలే సమంత పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్లో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది.


పుష్ప సినిమాలో అలరించిన సమంత అదే జోరు మీద బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ నటించడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా సమంత నటించిన తొలి మైథలాజికల్ రొమాంటిక్ చిత్రం శాకుంతలం. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా దిల్ రాజ్ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా బిజీగా ఉన్నారు చిత్రబృందం. గతంలో శాకుంతలం సినిమా మొదట్లో సమంత లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ని కూడా విడుదల చేయలేదు.
దీంతో సమంత పడిన శ్రమ అంతా వృధా అయ్యేలా ఉన్నట్లుగా కామెంట్ కూడా వినిపించాయి. అయితే తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దీంతో అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫోటో విషయానికి వస్తే సమంత అచ్చం దేవకన్యలా మెరిసిపోతోంది ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈమెను చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదంటూ కొంతమంది అభిమానులు తెలియజేస్తున్నారు. మరికొంతమంది సమంత నాభి అందాలతో ముగ్ధమనోహరంగా కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కూడా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: