సీనియర్ కథానాయికలలో ఒకరైన రాధిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాధిక తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు హీరోయిన్ గా ఏర్పరచుకుంది. రాధిక కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా అనేక పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఇతర భాషా సినిమా ఇండస్ట్రీలలో కూడా ఏర్పాటు చేసుకుంది.
హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రాధిక ప్రస్తుతం తల్లి పాత్రలలో , అత్త పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రాధిక నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా రాధిక ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చేసింది. ఇందులో భాగంగా అలీ , రాధిక ను మీకు ఈ జనరేషన్ లో బాగా ఇష్టమైన నటుడు ఎవరు అని అడగగా... వెంటనే రాధిక తారక రామారావు అని చెప్పేసింది. అలాగే నా గ్రాండ్ సన్ పేరు కూడా తారక్ అని రాధిక చెప్పింది.
తారక్ ను చూసి చాలా నచ్చి ఆ పేరు పెట్టాను. ఐ లైక్ హీమ్ అంటూ రాధిక తెలియజేసింది. దానితో ఆలీ చాలా సార్లు కలిసారా ఎన్టీఆర్ ను అని అడగగా... ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ ను కలవలేదు అని రాధిక సమాధానం ఇచ్చింది. అలాగే తారక్ తో నటించాలని ఉంది అని రాధిక తెలియజేసింది. దానితో ఆలీ, జూనియర్ ఎన్టీఆర్ కు తల్లి పాత్రలో నటించాలని ఉందా... లేక అత్త పాత్రలో నటించాలని ఉందా అని ప్రశ్నించగా... ఏదో ఒక పాత్ర తారక్ తో నటిస్తే చాలు అని సమాధానమిచ్చింది.