రాజీవ్ తో గొడవలు నిజమేనట.. షాకింగ్ విషయం చెప్పిన సుమ?
కొన్నాళ్ల పాటు అటు రాజీవ్ కనకాల గాని మరోవైపు సుమా గానీ వీటిపై స్పందించలేదు. ఇక ఆ తర్వాత ఒకానొక సమయం లో సుమ వ్యాఖ్యాతగా ఉన్నా క్యాష్ లోకి రాజీవ్ కనకాల రావడం ఇక రాజీవ్ కనకాల ని గట్టిగా హత్తుకుని సుమ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. దీంతో వీరిద్దరు విడిపోతున్నారు అన్న వార్తలు నిజం కాదని కొందరు కొట్టిపారేసారూ. ఇకపోతే ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరైంది యాంకర్ సుమ. జయమ్మ పంచాయతీ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమానికి ఆ వచ్చేసింది. ఈ క్రమంలోనే అలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది.
మీరు రాజీవ్ కనకాల విడిపోతున్నారా.. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉంది అని అడుగగా సుమ ఓపెన్ అయ్యింది. మా ఇద్దరి మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవమే పెళ్లి జరిగిన నాటి నుంచి ఇలాంటి గొడవలు ఎన్నో జరిగాయి. ఇక వేరుగా ఉన్న మాట కూడా వాస్తవమే. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం ఎంతో సులభం.. కానీ పేరెంట్స్ గా ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం మాత్రం చాలా కష్టం అంటూ సుమ చెప్పుకొచ్చింది. ఇక సుమ మాటలు విన్న తర్వాత నిజంగానే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయా మొన్నటి వరకు వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అనుకున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు..