అప్పటి నుండి ప్రారంభం కాబోతున్న రాజమౌళి...మహేష్ బాబు సినిమా..!

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కాకముందే మహేష్ బాబు తో తన తదుపరి సినిమా ఉండబోతోందని దర్శకుడు రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశాడు. ఇలా రాజమౌళి , మహేష్ బాబు తో తన తదుపరి సినిమా ఉండబోతోందని అనౌన్స్మెంట్ చేయడంతోనే ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కబోతుంది అంటూ అనేక కథనాలు బయటికి వచ్చాయి.  అయితే ఆ  కథనాలన్నింటికి పులిస్టఫ్  పెట్టేలా రాజమౌళి ఇది మల్టీస్టారర్ సినిమా కాదు అని మహేష్ బాబు ఒక్కడే హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అని స్పష్టం చేశాడు.  


ఇది ఇలా ఉంటే మెహేష్ బాబు తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా దక్షిణాఫ్రిక అడవుల నేపథ్యానికి సంబంధించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గా కొనసాగనుందని ఒక ఇంటర్వ్యూ లో విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కావడం,  పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం కూడా జరిగిపోయింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సంబంధించిన పనులన్నీ ముగియడంతో దర్శక ధీరుడు రాజమౌళి ఇకపై మహేష్ బాబు సినిమాపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.


అందులో భాగంగా దసరా సందర్భంగా రాజమౌళి ,  మహేష్ బాబు  కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాను లంచ్ చేయనున్నట్లు సమాచారం.  దసరా రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.  ఆ తర్వాత ఎక్కువ సమయం గ్యాప్ లేకుండా సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను పూర్తి చేసుకొని రాజమౌళి ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: