ఆ ఓటిటి సంస్థ ప్లాన్ మామూలుగా లేదుగా..!!
ఇక అంతే కాకుండా దీనిని ఒకరు తీసుకుంటే చాలు ఇతరులు కూడా వాడుకునే విధంగా ఉంటుంది. అమెజాన్ వంటి ఓ టి టి ఫ్లాట్ ఫామ్ ను ఎంతో మంది వినియోగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్న వాటిలో అమెజాన్ ప్రైమ్ ముందు వరుసలో ఉన్నది. అయితే మొన్నటి వరకు నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే బాటలో ఉండేది. కానీ నెట్ ఫ్లిక్స్ తమ పాలసీని మార్చడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక మీదట పాస్వర్డ్ షేరింగ్ అనే విషయాన్ని రద్దు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నది.
కేవలం ఒక్క అకౌంట్ మాత్రమే యాక్టివ్ ఉండేలా తగిన నిర్ణయాలు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఒకవేళ ఒక చోట లాగిన్ అయ్యారు అంటే.. మరొక చోట ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతుందట. దీనివల్ల నెట్ ఫ్లిక్స్ ఉపయోగించే వారు ఎక్కువగా అవుతారని భావించినట్లుగా తెలుస్తోంది. అయితే పాస్వర్డ్ షేరింగ్ విషయంలో సరికొత్త ఆప్షన్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.. అదేమిటంటే ఒక అకౌంట్ కలిగినవారు వారి యొక్క పాస్వర్డ్ అకౌంట్ నుండి వాటిని షేర్ చేస్తే.. అందులో సగం మొత్తం చెల్లించి ఆ అకౌంట్ ను సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చట. దీంతో తమకు కస్టమర్లు మరింత పెరుగుతారని ఈ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.