ఆచార్య ను టార్గెట్ చేస్తున్న నయనతార సమంత !

Seetha Sailaja
‘ఉప్పెన’ మూవీతో విజయ్ సేతుపతి క్రేజ్ తెలుగు ప్రేక్షకులలో బాగా పెరిగింది. దీనితో అతడి సినిమాలను డైరెక్ట్ గా తమిళంతో పాటు తెలుగులో కూడ విడుదల చేస్తున్నారు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన మూవీ ‘లవ్ మీ మ్యారేజ్ మీ’ అన్న డిఫరెంట్ టైటిల్ తో వచ్చేవారం విడుదల కాబోతోంది. ఈమూవీలో సమంత నయనతార లు విజయ్ సేతుపతిని ఒక ఆట పట్టించే పాత్రలలో ప్రియురాళ్ళుగా నటిస్తున్నారు.



లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతోంది. విజయ్ సేతుపతి ఇన్నోసెంట్ లుక్స్, నయన్ సమంత ల గ్లామర్ మీదనే ఆధారపడి సినిమా మొత్తం ఉండే విధంగా కనిపిస్తోంది. గతంలో బాలకృష్ణ నటించిన సినిమాలోని ‘ఇరువురి భామల కౌగిలిలో ఇరుకున పడి నీవు నలిగితివా’ ఆపాటను గుర్తుకు చేస్తూ ఈ మూవీ ట్రైలర్ ఉండటంతో ఈమూవీ పై సగటు ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి.



ఒక ప్రియురాలు కాఫీ తెచ్చి ఇస్తే మరొక ప్రియురాలు టీ తెచ్చి పెడితే ఇద్దరినీ కాదనలేక ఆ రెండు కప్పులను కళ్ళకు అడ్డుకుని ఒకే కప్పులో పోసుకుని కష్టపడి తాగిన ప్రేమికుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు. అంతేకాదు నయనతార లెంపకాయ కొడితే సమంత తో అడిగిమరీ మరో లెంపకాయ కొట్టించుకుని ప్రేమికుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు. ఈమూవీ పూర్తి కామెడీ మూవీ అన్నసంకేతాలు వస్తున్నాయి.


అయితే ఈమూవీని ‘ఆచార్య’ మ్యానియా లెక్కచేయకుండా ఈనెల 29న తమిళ తెలుగు కన్నడ మళయాళ భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. దీనికితోడు ఈ మూవీ ప్రమోషన్ ను సమంత నయనతార లు కలిసి చేస్తూ ఉండటంతో ఈకామెడీ మూవీలో ఏదోఒక డిఫరెంట్ విషయం ఉందా అన్నసందేహాలు కల్గుతున్నాయి. దీనితో చిరంజీవి మ్యానియాను లెక్కచేయకుండా ఒకవైపు శ్రీవిష్ణు మరొక వైపు సమంత నయనతార లు టాలీవుడ్ ను టార్గెట్ చేయడం చాలమందికి ఆశ్చర్య పరుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: