'RRR' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..?

Anilkumar
తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా  తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాను ఓటీటీలో చూడాలని మెగా, నందమూరి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.అంతేకాకుండా  ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. 

అయితే ఈ సినిమా హిందీ మినహా అన్ని భాషల హక్కులు జీ5 దగ్గరే ఉన్నాయి.ఇకపోతే  హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.అంతేకాకుండా జీ5 లో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ నేపథ్యంలో మే 13 నుంచి ఆర్.ఆర్.ఆర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ మూవీ మార్చి 25న విడుదల కాగా ఏడు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చనే ఒప్పందం జరిగిందని.. ఇక ఈ మేరకు 49 రోజుల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఓటీటీ అప్‌డేట్స్ ఇచ్చే అన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇకపోతే  ఈ తేదీపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ మూవీ రూ.వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌లను వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, సముద్రకని ఇతర కీలక పాత్రలు పోషించారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: