సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్, మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ కలిసి నటించడం ఇదే మొదటి సారి. ఈమూవీ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు పాటలను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా నుండి మూడవ పాటను కూడా విడుదల చేయనున్నట్లుచిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ఈ మూవీ ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు , కీర్తి సురేష్ ల మధ్య ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ఉండబోతునట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ లపై చిత్ర బృందం ను అదిరిపోయే మాస్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.