
సినిమా టికెట్ల ధరల పై మరొకసారి ఆంధ్రప్రదేశ్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..!!
దీంతో హైకోర్టు కొన్ని కీలక వాక్యాలను తెలియజేసింది.. అందులో ప్రధానమైనవి గా రెండు అంశాలను చూస్తే మొదటివి సినిమా ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండదని.. లైసెన్సింగ్ అథారిటీ అయిన జేసీ కి మాత్రమే అధికారం ఉంటుందని తెలియజేసింది. ఇక మరొకటి ఏమిటంటే ఆన్లైన్లో అమ్మే సినిమా టికెట్ల ధరలు.. సర్వీస్ చార్జి పేర్లతో టిక్కెట్ ధరలను కలిపి వీలు ఉండదని స్పష్టం చేసింది. అంతే కాకుండా పాత విధానంలోనే టికెట్లను అమ్ముకోవచ్చని తెలియజేసింది. ఆన్ లైన్ టికెట్లు విధానంపై దుర్వినియోగం మళ్లింపు వంటివి జరుగుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది.
ఇక వీటి కి సంబంధించిన వాటిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివి ఎస్ ఎస్ సోమయాజులు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇక తదుపరి విచారణ జూన్ 15 కు వాయిదా వేసినట్లు గా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లు టిక్కెట్ల ధరల విషయంలో సర్వీస్ ఛార్జీలు చేస్తున్నారనే విషయం పై జగన్ సర్కారు ఇచ్చిన జీవోలను.. దాఖలు చేస్తూ పిటిషన్ వేసిన వాటిపై కీలక అంశాల పైన పేర్కొన్నవి గా తెలియ చేయబడ్డాయి. సినిమా టికెట్ల విషయంలో ఆన్లైన్ సర్వీస్ ఛార్జీలను చేర్చడం సరి కాదని కోర్టు తెలియజేసింది.