"బీస్ట్" దర్శకుడి కెరీర్ క్లోజ్... రజినీ రిజెక్ట్ ?
కేజీఎఫ్ చాప్టర్ 2 ఘన విజయం గురించి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ప్రశంసలు వినిపిస్తున్నాయో అదే స్థాయిలో బీస్ట్ చిత్రం గురించి విమర్శలు పోటెత్తుతున్నాయి. బీస్ట్ సినిమా కలెక్షన్స్ రిలీజ్ అయిన రెండు మూడు రోజులకే దారుణంగా పడిపోవడంతో అంచనాలు తారుమారు అయ్యాయి. అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్నట్లుగా అయిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద కనీస కలెక్షన్ల రాబట్టలేక చతికిలబడ్డ ఈ సినిమా గురించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ సినీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఒక పాన్ ఇండియా చిత్రాన్ని ఈ రకంగా గొప్పగా తీయొచ్చని మీ సినిమా చూస్తే కానీ తెలియలేదు సార్ అంటూ కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.
అటు హీరో దళపతి విజయ్ కి కూడా మాటలు తప్పడం లేదు. అంతంత మాత్రంగా కూడా అసలు రాకపోవడంతో చాలా చోట్ల బీస్ట్ సినిమా థియేటర్ల నుండి తీసేశారని టాక్ వినిపిస్తోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇపుడు మరొక వార్త ప్రచారంలోకి వచ్చింది. అసలే బీస్ట్ సినిమా అంచనాలు తారుమారు కావడంతో తల పట్టుకు కూర్చున్న డైరెక్టర్ నెల్సన్ పై మరో పిడుగు లాంటి వార్త పడిందని సమాచారం. ఈ సినిమా రిజల్ట్ ఆయన కెరియర్ పైనే ప్రభావం చూపిందని అంటున్నారు. విషయం ఏమిటంటే... బీస్ట్ సినిమా తర్వాత దర్శకుడు నెల్సన్ సూపర్ స్టార్ రజిని కాంత్ తో ఒక భారీ ప్రాజెక్ట్ 'తలైవా 169'గా చేయాల్సి ఉంది. ఈ విషయం పై సన్ పిక్చర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసింది.
అయితే బీస్ట్ స్పెషల్ షో చూసిన రజినీ సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేశారని డైరెక్టర్ నెల్సన్ పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ గా ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దాంతో తాను చేయబోయే తదుపరి చిత్రానికి నెల్సన్ దర్శకుడిగా వద్దని వేరే డైరెక్టర్ చూడాలని నిర్మాతలకు చెప్పినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఏది ఏమైనా బీస్ట్ మూవీ ఇంత దారుణంగా విఫలమవడానికి దర్శకుడు నెల్సనే కారణం అన్న మాటలు ఎక్కువగా వినపడుతున్న నేపథ్యంలో అది ఆయన కెరియర్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు.