కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అనిరుద్ సంగీతం సమకూర్చిన బీస్ట్ సినిమా ఈ నెల 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే బీస్ట్ మూవీ విడుదల అయిన తర్వాత రోజు అనగా ఏప్రిల్ 14 వ తేదీన యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ టు మూవీ విడుదల అయిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే బీస్ట్ మూవీ పై అలాగే కే జి ఎఫ్ చాప్టర్ టు మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదటినుండి నెలకొని ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే బీస్ట్ మూవీ విడుదలైన మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను రాబట్టింది. కాకపోతే బెస్ట్ మూవీ కి తమిళ బాక్సాఫీస్ దగ్గర మినహాయిస్తే ఇతర ఇండస్ట్రీలో మాత్రం మిక్సింగ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే బీస్ట్ మూవీ విడుదల అయిన తర్వాత రోజే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల కావడం, అలాగే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకోవడంతో ప్రేక్షకులు ఎక్కువ శాతం కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. అలా బీస్ట్ మూవీ కి మిక్సీడ్ టాక్ రావడం, కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి సూపర్ హిట్ టాక్ రావడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ అదిరిపోయే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే సోమవారం చెన్నై సిటీలో 'బీస్ట్' 36 లక్షలను వసూలు చేస్తే, 'కేజీఎఫ్ 2' 62 లక్షలను రాబట్టింది. ఇలా సోమవారం రోజు చెన్నై సిటీ లో బీస్ట్ మూవీ కంటే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ఎక్కువ కలెక్షన్ లను సాధించింది.