బుల్లిపిట్ట: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. మీకు నచ్చినట్లుగానే..!!

Divya
వాట్సాప్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న యాప్ లతో పోటీపడుతూ వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లను విడుదల చేస్తూ వస్తోంది. దీంతో మరికొంతమంది యూజర్లను బాగా ఆకట్టుకునేలా చేస్తోంది వాట్సాప్. అయితే ఇప్పుడు తాజాగా last seen అనే ఆప్షన్ను ఎవరు చూడవచ్చు ఎవరు చూడకూడదు అనేవాటిని సెట్టింగ్ ద్వారా సెట్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్ల కోసం అందిస్తోంది.
ఎవరైనా  ఈ యాప్ ను చివరిసారిగా ఎప్పుడు చూశారో అందించే ఫ్యూచర్ ని అందిస్తోంది. అయితే ఇది వరకు మాత్రం వాట్సప్ లో last seen అనే ఆప్షన్ కోసం..every one my contacts,nobody అనే ఆప్షన్ ని మాత్రమే అందుబాటులో ఉండేది.. అందులో ప్రత్యేకమైన కాంట్రాక్టులను మాత్రమే.. కాకుండా మన మొబైల్లో ఉండేటువంటి కాంటాక్ట్ అందరూ చూసేవారు. అయితే ఇప్పుడు మాత్రం అలా కాకుండా అందరూ చూడకుండా సెట్ చేసుకునే విధంగా విడివిడిగా కాంటాక్ట్ లకు last seen చూడకుండా సెట్ చేసుకొనే ఆప్షన్ని ప్రవేశపెట్టింది వాట్సాప్.

ఇక అంతే కాకుండా ios యాప్ తాజాగా బీటా వేరియేషన్ లలో  కూడా whatsapp నిర్దిష్ట వ్యక్తులను వారి యొక్క చివరి దృశ్యం స్థితిని కూడా.. అందరూ చూడకుండా పరిమితం చేయడానికి వినియోగదారులకు ఈ ఫీచర్ ని అనుమతిస్తోంది. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే వారి లాస్ట్ సీన్ చూడవచ్చు..WA BETALNFO ప్రకారం, IOS, ఆండ్రాయిడ్ .. beta వంటి వాటిలో ఉన్న ఈ ఫీచర్ ని త్వరలో అందుబాటులోకి తీసుకురా బోతున్నారు. దీని ద్వారా మనకు ఇష్టమైన వ్యక్తులకు మాత్రమే మనం చివరిసారిగా ఎన్ని గంటల సమయంలో ఆన్లైన్లో ఉన్నామనే విషయం మాత్రమే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: