'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సినిమా ఆచార్య ఏప్రిల్ 29 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన  అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది.  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించగా ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన  పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతోంది.  ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది.  ఈ ట్రైలర్ లో  ఆచార్య చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది.


  వీరికి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువ శాతం ట్రైలర్ లో చూపించారు.  ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.  ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం మూడు పాటలను విడుదల చేసింది.  చిత్ర బృందం విడుదల చేసిన ఈ మూడు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ఈ నెల 18వ తేదీన ఈ సినిమా నుండి 'భలే భలే బంజారా'  అనే సాంగ్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.  ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు ఆంధ్ర ప్రదేశ్ దేశ్ సీఎం జగన్ వస్తున్నాడు అనే వార్త ప్రస్తుతం సినీ , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: