సౌత్ సినిమా యొక్క దమ్ము ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తోంది. మన సినిమాల సక్సెస్ రేటు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు కన్నడ మలయాళ సినిమా పరిశ్రమలో నుంచి వచ్చే సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటున్నాయి. బాలీవుడ్ సినిమాలను మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా సౌత్ సినిమాలు బాగా నడుస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మొన్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే పలు బాలీవుడ్ సినిమాలు విడుదల వెనక్కి తగ్గేలా చేసుకున్నాయి. అంతకు ముందు పుష్ప సినిమా విడుదల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు కే జి ఎఫ్ సినిమా కూడా విడుదల అయిపోతుంది కాబట్టి బాలీవుడ్ ప్రేక్షకులు ఏ స్థాయి లో సౌత్ సినిమాలపై ఇష్టాన్ని చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పోయిన ఏడాది డిసెంబర్ లో పుష్ప సినిమా విడుదల కాగా ఆ చిత్రానికి పోటీగా వచ్చిన 83 సినిమా పుష్ప చిత్రం ముందు ఏ మాత్రం నిలబడలేకపోయింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి పోటీగా జాన్ అబ్రహం హీరోగా నటించిన సినిమా విడుదల కాగా అది తొలిరోజు వసూళ్లను కూడా భారీగా సంపాదించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ విధంగా తమ సినిమాలను కాకుండా సౌత్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడటం అందరినీ కలవరపరుస్తోంది.
ఈ నేపథ్యంలో సౌత్ నుంచి వచ్చే పెద్ద సినిమాలను ఎదుర్కోలేక బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. అమీర్ ఖాన్ నటించిన అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ షాహిద్ కపూర్ నటించిన సినిమాలను ఇప్పటికే వాయిదా వేసుకున్నారు. ఏదేమైనా వాయిదాల పర్వం యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బాలీవుడ్ చూసేది కానీ నేడు ఇండియన్ సినిమా స్థాయికి సౌత్ సినిమా ఎదిగింది అంటే నిజంగా గొప్ప అని చెప్పాలి.